మనోహరాబాద్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి నవీన్ : మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లోని జడ్పీ చైర్మన్ దత్తత గ్రామమైన వెంకటాపూర్ అగ్రహారం గ్రామ సర్పంచ్ నీరుగంటి రేణుక ఆంజనేయులు ఆధ్వర్యంలో కాంగ్రెస్ బిజెపి పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆదివారం ఫారెస్ట్ డెవలప్మెంట్ వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెసిఆర్ చేసిన అభివృద్ధి పథకాలే ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోనీ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని ఎక్కడ చూసినా కెసిఆర్ అభివృద్ధి పనులే కనబడుతున్నాయని అభివృద్ధికి నిదర్శనమే రోజురోజుకు పార్టీలో చేరిన వారి సంఖ్య పెరుగుతుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు కెసిఆర్ నియోజకవర్గంలో కెసిఆర్ ను ఓడించి దమ్ము ఏ ఒక్క పార్టీకి లేదని కెసిఆర్ కు లక్ష ఓట్ల మెజార్టీ తో గెలిపించి కేసీఆర్కు కానుకగా ఇవ్వాలని నియోజకవర్గం ప్రజలకు పిలుపునిచ్చారు , టిఆర్ఎస్ పార్టీలో చేరిన మానుక లింగం, గుడ్ల కుమార్ ,ఏమ యాదగిరి, పుట్టి స్వామి, పూడురి ముత్యాలు, ఏమా శ్రీనివాస్, ఏమ నరేష్, అంబాపురం యాదగిరి, శ్రీకాంత్, ప్రవీణ్, గంట కృష్ణ, ఎల్లయ్య, మల్లేష్, స్వామీ, మహేష్ గౌడ్ కనకరాజు, నవీన్, అరుణ్, రమేష్, సురేష్, మల్లేష్ ,శేఖర్, మైసయ్య, చిల్ల సురేష్, సాయి, చిల్ల యాదగిరి, హేమంత్, కుమార్ బర్ల భగవంతు,లు చేరారు, ఈ కార్యక్రమంలో మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, ఉమ్మడి మండల ఫ్యాక్స్ చైర్మన్ మెట్టు బాలకృష్ణ రెడ్డి, రైతు సమన్వయ సమితి చైర్మన్ సుధాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ విట్టల్ రెడ్డి, నాయకులు రవి, నిరుగంటి ఆంజనేయులు, కార్యకర్తలు పాల్గొన్నారు

0 Comments