, ఎగిసిపడ్డ మంటలు
* కాలి బూడిదైన పత్తి
* కోట్లలో ఆస్తి నష్టం
* కుప్పకూలిన భారీ గోదాం
* తప్పిన ప్రాణ నష్టం
* మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది
మేడ్చల్ వాస్తవ తెలంగాణ న్యూస్:
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మేడ్చల్ మండల పరిధిలోని కొసాయిగూడలో కార్టూన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కోట్ల రూపాయల విలువ గల పత్తి కాలి బూడిదయింది. ఈ ఘటనలో గోడౌన్ లో పనిచేస్తున్న కార్మికులు సురక్షితంగా బయటకు వచ్చారు. ఆదిలాబాద్ బ్రాంచ్ కి చెందిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్ పూడూరు మండలంలోని కోసాయిగూడ లో ఉంది. ఆదిలాబాద్ లో కొనుగోలు చేసిన పత్తిని భారీ గోడౌన్ లో భద్రపరిచారు. మధ్యాహ్నం గోడౌన్ గేటుకు వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు మిరుగులు పత్తిపై పడడంతో మంటలు అంటుకొని చూస్తుండగానే కోట్ల రూపాయల విలువగల పత్తి ఖాళీ బూడిదయింది. ఒక సమయంలో మంటలు ఎగసి పడడంతో స్థానికులు ఆందోళన చెందారు. పక్కనే కెమికల్ గోడౌన్లు ఉండడంతో ఆ మంటలు ఎక్కడ అంటుకుంటాయోనని ఆందోళన చెందారు. ఎగిసి పడ్డ మంటలతో భారీ గోడౌన్ సైతం కుప్పకూలి పోయింది.మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు సాయంత్రం వరకు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రాత్రి వరకు మంటలు ఎగిసి పడ్డాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు

0 Comments