గెలుపు తీరాలకు చేరిన బీఆర్ఎస్ : ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి.
రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి
మనోహరబాద్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి నవీన్ : మనోహ
రాబాద్ మండలం జీడిపల్లి (గొల్లగడ్డ) గ్రామాల నాయకులు ఎఫ్.డి.సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో స్టేట్ సర్పంచ్ ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్కుల మహిపాల్ రెడ్డి, సర్పంచ్ రేఖ మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో జీడిపల్లి (గొల్లగడ్డ) నుండి యాదవ సంఘం బిజెపి,కాంగ్రెస్ నుండి 60 మంది నాయకులు బి.ఆర్.ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్బంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ కారు జోరుని వేగవంతం చేయాలని కెసిఆర్ చేస్తున్న పలు సంక్షేమ పథకాలు దేశానికే గర్వకారణం అని ఇలాంటి సీఎం మాన గజ్వేల్ నియోజకవర్గం నుంచి మనకు ఎమ్మెల్యే గా ఉండడం మాన అదృష్టం అని గుర్తుంచుకొని మూడోసారి కూడా బిఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చోట కన్ కరాటే తెలంగాణ స్టేట్ చీఫ్ సాయి కుమార్, శేఖర్, మహేష్ సభ్యుడు కుంట రాజుతదితరులు పాల్గొన్నారు.

0 Comments