ఒడిశా డాక్టర్స్ అసోసియేషన్ ఉచిత వైద్య శిబిరం
పటాన్‌చెరు,వాస్తవ తెలంగాణ న్యూస్:
జీవనశైలిలో అదుపు తప్పిన ఆహార అలవాట్లు, పరిశుభ్రత, పారిశుధ్యం, వాతావరణ మార్పులు తదితరాల వల్ల లెక్కకుమించి అరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్ గ్రామంలో గల పూరి జగన్నాథ్ దేవాలయ ఆవరణలో దేవాలయ కమిటీ మరియు తెలంగాణ ఒడిస్సా డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. ప్రతి రోజు క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేయాలని సూచించారు.

0 Comments