రహదారిపై ధాన్యం కుప్పలు పోయడం మే ప్రమాదానికి కారణం
కూతురు జన్మదిన వేడుకలకు వెళ్తూ అనంత లోకాలకు....
ట్రాక్టర్ బైక్ ఢీకొనడంతో బావ. తల్లి ఇద్దరు కూతుళ్లు మృతి....
పోతారం గ్రామంలో విషాదఛాయలు..
మనోహరాబాద్,వాస్తవ తెలంగాణ న్యూస్:మెదక్ జిల్లా లో కూతురి పుట్టినరోజు వేడుకల కోసం ఇద్దరు పిల్లల తో కలిసి తన బావ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అనుకోని మృత్యు ఘటన ట్రాక్టర్ రూపంలో కబళించి వేయడంతో నాలుగు నిండు ప్రాణాలు బలి కావడంతో రహదారి నెత్తురోడింది . గ్రామస్తుల, సంబంధికులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా మనోహరబాద్ మండల పరిధిలోని పోతారం గ్రామానికి చెందిన మన్నె,కుమార్ లావణ్య దంపతులకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కూతురు సంజన తన అమ్మమ్మ గారి నివాసమైన వర్గల్ మండలం మజీద్ పల్లి గ్రామంలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నది. శనివారం సంజన పుట్టినరోజు కావడంతో లావణ్య (35)రెండో కుమార్తె సహస్ర (10)చిన్న కూతురు శాన్వి (7) తో పిల్లల్తో కలిసి తన తల్లి గారి ఇంటికి వెళ్ళుటకు సిద్ధం కాగా తన భర్త వ్యవసాయ పనుల్లో ఉండడంతో బావ (భర్త అన్న) మన్నె ఆంజనేయులు,(50) ద్విచక్ర వాహనంపై శభాష్ పల్లి చౌరస్తాపై దింపడానికి వెళ్తున్న క్రమంలో స్థానిక ప్రాణా ఫుడ్స్ సమీపంలో ఎదురుగా వస్తున్న అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ వేగంగా డీ కొనడంతో బైక్ పై వెళుతున్న నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. దీనితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.దీనికి కారణం రహదారిపై ధాన్యం కుప్పలు పోయడంతో ఒకవైపు నుండే రాకపోకలు కొనసాగుతున్నాయి ఘటన జరిగిన సమయంలో సాయంత్రం వేళ చీకటిలో ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు గుర్తించలేక బలంగా ఢీకొనడంతో పెను ప్రమాదం జరిగి ఇద్దరు చిన్నారులతో సహా మరో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.పోలీసులు ఘటన స్థలానికి చేరుకోనీ గ్రామస్థులు ఆందోళనకు దిగి ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి కుటుంబాలకు న్యాయం చేసేవరకు మృతదేహాలను తరలించమని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణ నెలకొండతో పోలీసులు గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు పోలీసులు సర్దిచెప్పి మృదేహాలని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


0 Comments