Wanted Reporters

Wanted Reporters

అభివృద్ధి చెయ్యని పార్టీల అసత్యపు ప్రచారాలు నమ్మవద్దు :వంటేరు ప్రతాప్ రెడ్డి

 తూప్రాన్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి నవీన్ : మెదక్ జిల్లా  తూప్రాన్ మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ ఘనపూర్ గ్రామంలో సోమవారము బిఆర్ఎస్ పార్టీ రెండో విడత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, ఎలక్షన్ రెడ్డి, బాబుల్ రెడ్డి,  యాదవ్ లు మాట్లాడుతూ సుమారు డెబ్బై ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ నాయకులకు కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాల పట్ల సోయి కూడా లేదని, కనీసం వారి ఊహల దరిదాపుల్లో కూడా ఇటువంటి సరికొత్త పథకాలు లేకుండేనని, ఇప్పుడు వచ్చి మేం ఏదో చేస్తామని బడాయి మాటలు పలుకుతున్నారన్నారు. ఇదే రేవంత్ రెడ్డి అమెరికాలో ఉండి రైతులకు మూడే గంటలు కరెంటు ఇస్తానన్నాడని గుర్తు చేశారు. కాంగ్రెస్ గాలి నడుస్తోంది అని వినిపిస్తున్న ఊహ గణాలన్నీ ఉత్తుత్తివే అని కొట్టి పారేశారు. అనంతరం ఎంపీపీ గడ్డి స్వప్న వెంకటేష్ యాదవ్, సర్పంచ్ మిద్దింటి పుష్ప నవీన్, ఉప సర్పంచ్ ఆకుల రవి లు  మాట్లాడుతూ తెలంగాణలోని సబ్బండ వర్గాల ప్రజలు తమ తమ వృత్తి పనులతో అభివృద్ధి చెందుతూ అప్పులు తెచ్చుకునే పరిస్థితి నుండి అప్పులు ఇచ్చే స్థాయికి చేరుకోవాలని కాంక్షతోనే సీఎం కేసీఆర్ గొర్రెల యూనిట్లు, చేప పిల్లల పంపిణీ, దళిత బంధు, బీసీ బందు వంటి పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఇన్నేళ్ల పాలనలో రైతులకు ఒక్క రూపాయి సహాయం చేయని కాంగ్రెసోళ్లు ఇప్పుడు కెసిఆర్ రైతుబంధు ఇస్తుంటే ఈ యొద్దని లేఖలు రాసారని మండిపడ్డారు. బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని, బి ఆర్ ఎస్ ను గెలిపించి అభివృద్ధిని సాధిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి , గ్రామ ప్రజలు పాలకవర్గo సభ్యులు, యువకులు  బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code