Wanted Reporters

Wanted Reporters

బతుకులు బాగుచేస్తాడని నమ్మి ఓటు వేస్తే భూములు లాక్కొని రోడ్డున పడేశాడు : ఈటెల రాజేందర్

 బతుకులు బాగుచేస్తాడని నమ్మి ఓటు వేస్తే భూములు లాక్కొని రోడ్డున పడేశాడు : ఈటెల రాజేందర్ 






తూప్రాన్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి : తమ బతుకులు బాగుపడుతాయని రెండుసార్లు నమ్మి ఓటేసిన పాపానికి 5600 ఎకరాల పేదల భూములను ఆ కుటుంబాలను రోడ్డున పడేసిన కెసిఆర్ ను మీరే బుద్ధి చెప్పాలని గజ్వేల్ బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ తెలిపారు,

సోమవారం రోజు ఆయన తూప్రాన్ మండల లోని ఇమాంపూర్, అల్లాపూర్, యావపూర్, మరియు తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో రోడ్డు షో నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడారు .ఇమాంపుర్ గ్రామంలో ప్రారంభ చేసిన రోడు షో కి బారీ ఎత్తున ప్రజలు నాయకులు హాజరై గజమలతో స్వాగతం పలికారు.అంబేత్కర్ విగ్రహానికి పూలమాల వేసి ప్రజల్లో తిరుగుతూ కేసిఆర్ పై ఈటెల ద్వజమెత్తారు.మంచి భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ తమ బతుకు తాము బతుకుతున్నామని  రైతుల భూములు అతి తక్కువ ధరకు లాక్కుని వేల కోట్ల కమిషనలు పొంది కోట్ల రూపాయలకు విక్రయిస్తున్న దౌర్బుగ్యపు ప్రభుత్వం బీఅర్ఎస్ అని మండిపడ్డారు.వ్యవసాయం చేసుకుంటూ పిల్లలను చదివించి కష్టం నమ్ముకున్న వాళ్ళని రోడ్డుపై మొక్కజొన్న కంకులు పండ్లు అమ్ముకునే దీనస్థితి కి కారణం కేసిఆర్ కదా అని అన్నారు.ఎన్నడూ లేని బీఅర్ఎస్ బ్రోకర్ లు నాయకులు ఇప్పుడు వస్తున్నా రని విందులు లు ఇస్తారు  కుల సంఘాలతో మీటింగ్ లు పెడుతున్నారు మల్లోసారి వారి బ్రమలో పడి ఓటేస్తే భవిష్యత్తుకు లో చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉందని అన్నారు కాయకష్టం చేసి పిల్లలను చదివిస్తే వారికి ఉద్యోగాలు ఇవ్వకుండా నోటిఫికేషన్ లు వేస్తూ పపేర్ లికు చేస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు..


*_ప్రజలు ఆశీర్వదిస్తే కంటికి రెప్పలా  కాపాడుకుంట...


ఇన్ని రోజులు మోసపోయింది చాలు ఒక్కసారి మీ ఆశీర్వాదం భారతీయ జనతా పార్టీకి అందిస్తే  మీ కష్ట సుఖాల్లో ఉంటానని నోటీసులు ఇచ్చిన భూములు తిరిగి వారికే ఇస్తమని హమినిస్తున్నమని ఈటెల రాజేందర్ అన్నారు.బీసీ వర్గాలకు కేసిఆర్ ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగిందని దొరల పాలన నుండి మనకు విముక్తి సమయం దగ్గరలోనే ఉందని ఆయన అన్నారు. తూప్రాన్ పట్టణంలో మాజీ సర్పంచ్ శివమ్మ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది తూప్రాన్ మాజీ ఎంపీపీ గుమ్మడి శ్రీనివాస్ ఈటెల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ కన్వీనర్  వర్గాంటి రామ్మోహన్ గౌడ్ కపర రాంప్రసాద్ మధుసూదన్ రెడ్డి ఐలయ్య రాష్ట్ర సర్పంచుల ఫోరమ్ ఉపాధ్యక్షుడు నత్తి మల్లేష్ ముదిరాజ్ , నరేంద్ర చారి,బాల పోశయ్య దుర్గరాజు యాదవ్ సాయిబాబా ఆంజనేయులు మహేష్ గౌడ్ జానకి గౌడ్ మహేష్ రవి సాయిబాబాగౌడ్ మండల అధ్యక్షుడు మహేష్ నరేందర్ చారి అంజా గౌడ్ మరియు అయ గ్రామాల సర్పంచ్లు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

Post a Comment

0 Comments

Ad Code