Wanted Reporters

Wanted Reporters

కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం -ఆవుల శైలజ రెడ్డి

 కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం-ఆవుల శైలజ రెడ్డి



కొల్చారం వాస్తవ తెలంగాణ న్యూస్:


   మెదక్ జిల్లా కొల్చారం మండల వ్యాప్తంగా కొల్చారం, వరిగుంతం, రాంపూర్, కిష్టాపూర్, చిన్న ఘనపూర్ గ్రామాలలో ఆవుల శైలజ రెడ్డి బుధవారం పర్యటించి ఆవుల రాజి రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల కేంద్రమైన కొల్చారంలోని శ్రీ రేణుక ఎల్లమ్మను దర్శించుకుని ప్రచార యాత్ర ప్రారంభించారు. ఇంటింటికి, గడప గడపకు తిరిగుతూ కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామంలో ప్రజల నుండి శైలజా రెడ్డికి అపూర్వ స్పందన లభించింది. ఈ సందర్భంగా ఆవుల శైలజా రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, కాంగ్రెస్ ని గెలిపిస్తే బిఆర్ఎస్ ప్రభుత్వం ఈ పదేళ్లలో చేయలేని అభివృద్ధిని ఆవుల రాజిరెడ్డి హయాంలో చేసి చూపిస్తామన్నారు. కాగా మండలంలోని చిన్న ఘనపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం సభ్యులు సుమరు 150 మంది కార్యకర్తలు శైలజా రెడ్డి, మండలాధ్యక్షుడు నాగుల గారు మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.  ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్, వరిగుంతం సర్పంచ్ ఉమా రాణి శ్రీకాంత్, ఉపాధ్యక్షులు ముత్యం గారి గోవర్ధన్, పట్లూరి అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి గంగసాని మహేశ్వర్ రెడ్డి, మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు సయ్యద్ అక్రమ్, మండల కోశాధికారి సిహెచ్ మధుసూదన్ రెడ్డి, కొల్చారం గ్రామ శాఖ అధ్యక్షులు మాజీ సర్పంచ్ ఆశన్న గారి శ్రీశైలం, రాష్ట్ర ఓబీసీ సెల్ కార్యదర్శి మురళీధర్ పంతులు, బీసీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి అక్కంగారి రవీందర్ గౌడ్, సంగం పేట గ్రామ శాఖ అధ్యక్షులు ఆగంగడ్, వరిగుంతం మాజీ ఉపసర్పంచ్ విజయ్ గౌడ్, మండల యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తోష్య నవీన్, మండల యువజన కాంగ్రెస్ నాయకులు గాజుల కలీం, ఆయుబ్, పెద్ద ఎత్తున మహిళ కార్యకర్తలు అభిమానులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code