దండుపల్లిలో బిజెపి టిడిపి ప్రచారం : నత్తి మల్లేష్ ముదిరాజ్
మనోహరబాద్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి నవీన్ : మనోహరాబాద్ మండలం దండుపల్లి గ్రామంలో జోలందుకున్న బిజెపి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నట్లు కాలకల్ సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్ పేర్కొన్నారు, మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం దండుపల్లి గ్రామంలో సోమవారం రోజున రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం ఉపాధ్యక్షుడు సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్, మండల అధ్యక్షుడు నరేంద్ర చారి తో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం అభ్యర్థి ఈటల రాజేందర్ కు మద్దతు కోరుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు, ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు నరేందర్ చారి, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments