*రాజకీయ పార్టీల నాయకులను నిలదీయండి-ఆదివాసీ సమాజానికి జి ఎస్ పి పిలుపు
వాస్తవ తెలంగాణ ప్రతినిధి, (నుగూరు)వెంకటాపురం, నవంబర్ 1 :
రాష్ట్రంలో ఎన్నికల జాతర మొదలైందని అమాయక ఆదివాసీ బిడ్డల ఓట్ల కోసం రంగురంగుల జెండాలతో రాజకీయ నాయకులు ఆదివాసీ గూడేల బాట పడతారని ఆదివాసీ హక్కులను కాలరాస్తూ ఓట్ల కోసం వచ్చే నాయకులను నీలాదీయాలని గొండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం వెంకటాపురం మండల కేంద్రంలోని కొమరం భీమ్ విగ్రహం దగ్గర జి ఎస్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూనం సాయి దొర అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గడిచిన పది సంవత్సరాల కాలంలో ఐదవ షెడ్యూల్ భూభాగంలో ఆదివాసీలకు తీవ్రమైన నష్టం జరిగిందని విద్య,ఉద్యోగ, వైద్య, ఉపాధి, వ్యవసాయ రంగాలలో తీవ్ర నష్టం వాటిల్లిందని, రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ సమస్యల పట్ల వాటి పరిష్కారానికి ఎక్కడా ప్రయత్నించలేదని, ఈ విషయం లో రాష్ట్ర సర్కార్ ఘోరంగా విఫలం చెందిందని ఆరోపించారు.
ఈసార్వత్రిక ఎన్నికల్లో పనికిరాని హామీలతో గూడే లలోకి వస్తున్న ప్రధాన పార్టీల నాయకులను ఆదివాసి సమాజం నిలదీయాలని విజ్ఞప్తి చేశారు.
ప్రధాన రాజకీయ పార్టీల మేనిఫెస్టోలో ఆదివాసుల డిమాండ్లను ఎక్కడ చేర్చలేదని అలాంటప్పుడు
ఆదివాసుల ఓట్ల కోసం ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో మాత్రమే ఆయా పార్టీల నాయకులు వస్తున్నారు తప్ప వేరే సమయంలో ఆదివాసుల సమస్యలపై హక్కుల పైవచ్చి అడిగిన దాఖలాలు ఎక్కడ కనిపించడం లేదని ఏజెన్సీ ప్రాంతాలలో మారుమూల ఆదివాసి ప్రాంతాలకు మౌలిక సమస్యలు నీటి సౌకర్యం రోడ్లు విద్యా వైద్యం అందకుండా రోగం వస్తే ఆదివాసీలు ఇంకా జడ్డీ లతో రోగులను మోసుకొచ్చే పరిస్థితి ఉండటం సిగ్గుచేటన్నారు. ఎన్నికలు వస్తూ పోతూ ఉంటాయి కానీ ఆదివాసీల సమస్యలు ఎప్పటికీ అలాగే ఉండిపోతున్నాయి
ఆదివాసులకు ప్రధాన వనరు భూమి ఆ భూమిని అడవిని నమ్ముకుని జీవనం కొనసాగిస్తూ వస్తున్నారని
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐదవ షెడ్యూల్ భూభాగంలో ఉన్న భారత రాజ్యాంగ చట్టాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఆదివాసీలను ఓటు బ్యాంకు గానే వినియోగించుకుంటూ గద్దనెక్కిన తర్వాత ఆదివాసీలకు వ్యతిరేకంగా చట్టాలను సవరణకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పోడు భూములకు అరకొర పట్టాలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండి పడ్డారు.
ఈసమావేశంలో కనితి కృష్ణ, చింతామోహన్,
జిల్లాఅధ్యక్షులు రేగ గణేష్, మట్టి రమేష్, పూనెం మునేష్ తదితులుపాల్గొన్నారు.

0 Comments