Wanted Reporters

Wanted Reporters

శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

 శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్







రామచంద్రాపురం తెలంగాణ సాక్షి న్యూస్:-


శాసనమండలి చైర్మన్  భూపాల్ రెడ్డి సహాయ సహకారాలతో పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మండలి ప్రొటెం చైర్మన్ గా ఎన్నికైన అనంతరం తొలిసారి తన స్వస్థలమైన రామచంద్రపురం పట్టణానికి విచ్చేసిన సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ పరిధిలోని ప్రజా ప్రతినిధులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ మూడు సార్లు శాసనమండలి సభ్యునిగా ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో అజాతశత్రువు గా భూపాల్ రెడ్డి నిలిచారని ప్రశంసించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేశారని కొనియాడారు.  శాసనమండలి చైర్మన్ హోదాలో పటాన్చెరు నియోజకవర్గం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందించాలని ఎమ్మెల్యే జిఎంఆర్ కోరారు. ఈ సందర్భంగా రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని చెరువు కట్ట పై గల మల్లన్న దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Post a Comment

0 Comments

Ad Code