Wanted Reporters

Wanted Reporters

*ఏటీఎంలో డబ్బులు నింపుతున్నవారిపై దుండగుల కాల్పులు

 *ఏటీఎంలో డబ్బులు నింపుతున్నవారిపై దుండగుల కాల్పులు*    

తెలంగాణ సాక్షి న్యూస్:-


రాష్ట్రరాజధానిలో మిట్టమధ్యాహ్నం కాల్పుల ఘటన కలకలం రేపింది. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో ఏటీఎం సిబ్బందిపై దుండగులు కాల్పులు జరిపి.. డబ్బులు దోచుకెళ్లారు. పటేల్‌కుంట పార్కు సమీపంలోని హెచ్​డీఎఫ్​సీ బ్యాంకు వద్ద ఏటీఎంలో డబ్బులు నింపేందుకు మధ్యాహ్నం సిబ్బందికి వచ్చారు. యంత్రంలో డబ్బులు నింపుతుండగా బ్యాంకు వద్దకు చేరుకున్న దుండగులు... కాల్పులకు తెగబడ్డారు. ఇద్దరు ఏటీఎం సిబ్బందితో పాటు సెక్యూరిటీ గార్డుపై మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. అనంతరం, వారి వద్ద ఉన్న డబ్బును దోచుకెళ్లారు. దుండగుల కాల్పుల్లో ఏటీఎం సిబ్బంది అలీ బేగ్‌, శ్రీనివాస్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా... మార్గ మధ్యలోనే అలీ మృతి చెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. 2 బుల్లెట్లు, బుల్లెట్‌లాక్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా దొరికిన ఆధారాలతో పాటు సీసీకెమెరాలను పరిశీలిస్తూ... దుండగుల కోసం గాలిస్తున్నారు. కాల్పుల కలకలంతో స్థానికంగా తీవ్రభయాందోళన నెలకొంది. ఘటనా స్థలాన్ని సీపీ సజ్జనార్​ పరిశీలించారు.

Post a Comment

0 Comments

Ad Code