Wanted Reporters

Wanted Reporters

ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ 78వ జన్మదిన వేడుకలు

 హైదరాబాద్: తెలుగు సినీ ప్రేక్షకులకు కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరోగా ప‌సందైన వినోదాన్ని అందించి సూప‌ర్ స్టార్‌గా ఎదిగారు కృష్ణ‌. హీరోగా 56 ఏళ్ల నట ప్రస్థానంలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన సూపర్ స్టార్ కృష్ణ నేడు 78వ వసంతంలోకి అడుగుపెట్టిన సంద‌ర్భంగా ఆయ‌న‌కు ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు బ‌ర్త్‌డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.


ప్ర‌తి ఏడాది కృష్ణ బ‌ర్త్‌డేని అభిమానులు ఘ‌నంగా జ‌రిపేవారు. ఈ సారి క‌రోనా ఉదృతి ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల‌న కృష్ణ త‌న బ‌ర్త్‌డేని కుటుంబ స‌భ్యుల మ‌ధ్య జ‌రుపుకున్నారు. హీరో సుధీర్ బాబు, మ‌హేష్ త‌ల్లి, గ‌ల్లా జ‌య‌దేవ్, సీనియ‌ర్ న‌రేష్ త‌దిత‌రులు బ‌ర్త్‌డే వేడుక‌లో పాల్గొన్నారు. టెక్నికల్ గా తెలుగు సినిమాను ఎన్నో ఎత్తులకు చేర్చిన సూపర్ స్టార్ కృష్ణ‌ నట వారసత్వాన్ని మ‌హేష్ బాబు టాలీవుడ్‌లో కొనసాగిస్తున్నారు. 

Post a Comment

0 Comments

Ad Code