Wanted Reporters

Wanted Reporters

టిఆర్ఎస్ హయాంలో గ్రామాలకు మహర్దశ గడ్డపోతారం లో సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

 టిఆర్ఎస్ హయాంలో గ్రామాలకు మహర్దశ

గడ్డపోతారం లో సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ 




జిన్నారం తెలంగాణ సాక్షి న్యూస్:-


ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. జిన్నారం మండలం గడ్డపోతారం గ్రామంలో ఆదివారం సాయంత్రం 22 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన సిసి రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతినెలా నిధులు అందజేస్తూ ప్రజల అవసరాలకనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు.

Post a Comment

0 Comments

Ad Code