*హరితహారం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి - తెరాస జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్*
జిన్నారం, తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా నేడు గురుకుల పాఠశాల సమీపంలో టిఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశం గౌడ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వెంకటేశం గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దార్శనికత వల్లే హరితహారం ఉద్యమంలా సాగుతుందని తెలిపారు. అడవుల పెరుగుదలకు మొక్కలు పెంచడం అవసరమన్నారు. ఆహ్లాదకరం కోసం మానసిక ఉల్లాసం కోసం వాతావరణాన్ని పచ్చదనంతో నింపాలి అన్నారు. హరితహారం కార్యక్రమాన్ని ఆయా దశల్లో చేపడుతూ అటవీ విస్తీర్ణం 24 శాతం నుండి 49 శాతానికి పెంపొందించారు అన్నారు.ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మొక్కలు నాటడమే కాకుండా సామాజిక బాధ్యత అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు అవసరమని ఇది గుర్తించి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత కూడా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంజీవ వార్డు సభ్యులు శ్రీధర్ గౌడ్ మాజీ ఎంపిటిసి శ్రీనివాస్ రెడ్డి నాయకులు బ్రహ్మేంద్ర గౌడ్ నర్సింగ్ రావు చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


0 Comments