Wanted Reporters

Wanted Reporters

-ఆదివాసి సీనియర్ రాష్ట్ర నేత పూనెం సాయి దొర డిమాండ్

 *ఆదివాసుల్ని ఆదరించిన  మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు*

-ఆయనను వెంటనే విడుదల చేయాలి 

-ఆదివాసి సీనియర్ రాష్ట్ర నేత పూనెం సాయి దొర డిమాండ్



 వాస్తవ తెలంగాణ ప్రతినిధి, (నుగూరు)వెంకటాపురం, అక్టోబర్ 6:

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ వెంటనే బెయిల్ పై విడుదల చేయాలని శుక్రవారం  పత్రికలకు ఆదివాసి సీనియర్ రాష్ట్ర నాయకులు పూనేం సాయి  ప్రకటన విడుదల చేసారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఉమ్మడి రాష్ట్రంలో  చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పని చేసిన సమయంలో ఆదివాసులకు షెడ్యూల్ ఏరియాలో అడవిని నీటిని భూమిని నమ్ముకుని బ్రతుకుతున్నారని,ఆదివాసుల కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  ఆ రోజుల్లో జీవో 275 అమలు చేసి షెడ్యూల్ ఏరియాలో ఆదివాసీలే టీచర్లు, అంగన్వాడి టీచర్లుగా,  విఆర్ఓ, ఏఎన్ఎంగా,నియమించిన ఘనత తెలుగుదేశం పార్టీకే ఉందన్నారు,ఏజెన్సీ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జన్మభూమి కార్యక్రమాలు ఎంతో గణనీయంగా పనిచేశారుఅని  ఆయన పేర్కొన్నారు,ఏజెన్సీ ప్రాంతాలలో 275 జీవో ప్రకారంగా దాని అనుసరించుకొని 3 జీవో తీసుకొచ్చారని గుర్తు చేశారు, రాజకీయంగా చంద్రబాబు నాయుడు ఎదురుకొలేక ఇలా అక్రమ కేసుల్లో ఇరికించరని ఎదుగుదల మరువలేక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేస్తారని, ఒక మాజీ చీఫ్ మినిస్టర్ నీ అరెస్ట్ చేయాలంటే ముందస్తు నోటీసులు పంపించాలని ఆయన అన్నారు, స్వర్గీయులు నందమూరి తారక రామారావు దయవల్ల ఆదివాసీలకు ఉమ్మడి రాష్ట్రంలో టీచర్ పోస్టులు మరియు అంగన్వాడి ఏఎన్ఎం అన్ని పోస్ట్లు ఆదివాసులకే వచ్చాయని మరో సారి ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు

Post a Comment

0 Comments

Ad Code