Wanted Reporters

Wanted Reporters

వంట కార్మికులకు, వేతనాల పరిస్థితి ఏమిటి

 వంట కార్మికులకు, వేతనాల పరిస్థితి ఏమిటి ?     -అల్పాహార పథకాన్ని ఆహ్వానిస్తున్నాం. -భోజన  పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 




జంపాల రవీందర్. వాస్తవ తెలంగాణ ప్రతినిధి, (నుగూరు)వెంకటాపురం, అక్టోబర్ 6: ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో  నిర్వహిస్తున్న వంట కార్మికుల సమ్మె శుక్రవారం కి 17 రోజులకు చేరింది వెంకటాపురం మండల కేంద్రంలోని సమ్మె శిబిరంలో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు  ఈ కార్యక్రమానికి తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ ,సిపిఐ జిల్లా కార్యదర్శి తోట మల్లిఖార్జునరావు, పాల్గొన్నారు అనంతరం మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వారు  మాట్లాడుతూ17 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా వంట కార్మికులకు పెంచిన వేతనాలు ఖాతాలలో జమ చేయాలని, సమ్మె చేస్తూ ఉంటే ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమైన చర్య గా ఆయన అన్నారు. రోజుకు వంద రూపాయలతో వంటలు చేయాలంటే సాధ్యం అవుతుందా అని ప్రశ్నించారు. వంట కార్మికుల న్యాయమైన డిమాండ్లను తీర్చకుండా తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నుండి నూతనంగా ప్రవేశపెట్టిన     అల్పాహారం కార్యక్రమం ప్రారంభం చేస్తుంది ఈ కార్యక్రమం చేయాలంటే ఉదయం 7 గంటలకే పాఠశాలకు రావలి  సాయంత్రం 4గ, అవుతుంది అన్నారు మరి ఈ వంటకు కూడా అదే వంద రూపాయలతో వంటలు చేయాలంటే సాధ్యం అవుతుందా అని ప్రశ్నించారు  కనీసం10,000/,-అందిస్తేనే వంటలు చేయడం సాధ్యం అవుతుంది అని  హెల్త్ కార్డులు, అందించాలని ఇంకా యూనిఫాం అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో  సిపిఐ జిల్లా కార్యదర్శి తోట మల్లిఖార్జునరావు, ఏఐటియుసి మండల అధ్యక్షులు కట్ల రాజు, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షులు కుడుముల సమ్మక్క, నాయకులు రాంబాబు, పోదెం సమ్మక్క, పొలం రాజేశ్వరి, నాగమణి, రాజేశ్వరి, సరోజన, కౌసల్య, సావిత్రి ,శకుంతల, పార్వతి, లలిత కరుణ వెంకట నర్సు రమణ, సడలి, జ్యోతి, రాధా, భద్రమ్మ, నాగరాణి, తదితరులు పాల్గొన్నారు*

Post a Comment

0 Comments

Ad Code