Wanted Reporters

Wanted Reporters

రైతన్నకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం జీలుగు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

 రైతన్నకు అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం

జీలుగు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్




జిన్నారం తెలంగాణ సాక్షి న్యూస్:-


వ్యవసాయ భూముల్లో భూసారం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ పై పంపిణి చేస్తోన్న జీలుగు విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. శుక్రవారం జిన్నారం మండలం సోలక్పల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులకు జీలుగు విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రసాయన ఎరువులు వాడకం పెరిగిపోవడంతో భూములు తమ సహజత్వాన్ని కోల్పోతున్నాయనీ అన్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న జీలుగు విత్తనాలను ప్రతి రైతు వినియోగించుకోవాలని కోరారు. జిన్నారం మండల పరిధిలో 60 శాతం సబ్సిడీ పై 90 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.  గత పాలకుల హయాంలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగం నేడు లాభసాటిగా మారిందంటే  ప్రధాన కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాలే అన్నారు. దుక్కి దున్నినప్పటి నుండి పంటను కొనుగోలు చేసే వరకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. అనంతరం గ్రామంలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్ధాపన చేశారు.

Post a Comment

0 Comments

Ad Code