Wanted Reporters

Wanted Reporters

గిరిజన ఆశ్రమ పాఠశాలలను సందర్శించిన జి.ఎస్.పి రాష్ట్ర అధ్యక్షులు

 






వాస్తవ తెలంగాణ ప్రతినిధి నూగురు వెంకటాపురం ములుగు జిల్లా డిసెంబర్ 31



 వెంకటాపురం మండలంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు చిరుతపల్లి వన్ లక్ష్మీనగరం ఆదివాసి విద్యార్థుల పాఠశాల విద్యార్థులతో జి ఎస్ పి రాష్ట్ర అధ్యక్షులు  పాయం సత్యనారాయణ మరియు జి ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి పనేం  సాయి కలిసి ఆదివాసి విద్యార్థులతో మాట్లాడి వారితో మమేకమై ఆదివాసి విద్యార్థులతో భోజనం చేశారు. ఆదివాసి విద్యార్థులపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని విద్యార్థినీ విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. షెడ్యూల్ ఏరియాలో ఆదివాసి విద్యార్థులు ఇప్పుడిప్పుడే విద్యకు అలవాటు పడుతున్నారని ఆయన అన్నారు అడవిని నమ్ముకుని ఆదివాసి విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారని ఐక్యరాజ్యసమితి ఆదివాసి విద్యార్థులను గుర్తించి ఆదివాసి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఐ టి డి ఏ ల ద్వారా ఆదివాసి విద్యార్థుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక నిధులు విడుదల చేస్తున్నారని ఆ నిధులను గిరిజన ఆశ్రమ పాఠశాల లో అవినీతి వార్డెన్లు ఇష్ట రాజ్యాంగ  వాడుతున్నారని ఆయన అన్నారు ఆదివాసి విద్యార్థులకు గిరిజన ఆశ్రమ పాఠశాలలో మెనూ  ప్రకారంగా ఆదివాసి విద్యార్థులకు పౌష్టికాహారం అందించలేక పోతే జి.ఎస్.పి నిరంతర ఉద్యమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జి ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి సాయి ఉన్నారు

Post a Comment

0 Comments

Ad Code