*నేడు గుమ్మడిదల మండలం లో 10 పాజిటివ్ కేసులు నమోదు*
గుమ్మడిదల తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం లో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 19 మందికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్ రిపోర్టులు వచ్చినట్లు వైద్య అధికారులు వెల్లడించారు. గ్రామాల వారిగా వివరాలను పేర్కొన్నారు.నల్లవల్లి లో 1, దోమడుగు 1, గుమ్మడిదల లో 2, బొంతపల్లి లో 1, అన్నారం లో 4, ఇతర చోట్ల 1 చొప్పున నా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు.

0 Comments