పట్ట పగలే మట్టి తవ్వకాలు..
- పట్టించుకోని మైనింగ్ అధికారులు
- ఇష్టానుసారంగా చెరువుల తవ్వకాలు
సెలవు దినములో మట్టి మాఫియా బీభత్సం
నిజాంపేట్, వాస్తవ తెలంగాణా న్యూస్
ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్న సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామ శివారులో గల సోనార్ కుంటలో జెసిబిల సహాయంతో టిప్పర్ల ద్వారా పట్టపగలే యేదేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో మండల తాసిల్దార్ ప్రభుత్వ కార్యాలయాలు సెలవులు ఉండడంతో ఇదే అదునుగా చేసుకొని మట్టి అక్రమ దారులు యదేచ్చగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ అనుమతులు లేకుండా చెరువులో నుండి మట్టిని తన ఇష్ట రీతిలో పూడికలు తీయడం వల్ల అధిక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని రైతులు పలువురు వాపోతున్నారు.

0 Comments