Wanted Reporters

Wanted Reporters

సంక్షేమ రాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ డాక్టర్ యర్రంరెడ్డి తిరుపతి రెడ్డి

 సంక్షేమ రాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. 

టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ డాక్టర్ యర్రంరెడ్డి తిరుపతి రెడ్డి



 తొర్రూరు సెప్టెంబర్ 09( వాస్తవ తెలంగాణ) .

సంక్షేమ రాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ డాక్టర్ యర్రంరెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. శనివారం తొర్రూరు మండల యూత్ కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ డాక్టర్ యర్రంరెడ్డి తిరుపతి రెడ్డిని స్థానిక విశ్రాంతి భవనంలో మర్యాద పూర్వకంగా కలిసి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ యర్రoరెడ్డి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పేదలకు న్యాయం జరగడంతో పాటు సంక్షేమ పథకాలు అందాయని, ఆనాటి సంక్షేమ పథకాలు పేదలకు అందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని గుర్తు చేశారు. మీ వెంటే నేను వెన్నంటి ఉంటూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో పాలకుర్తిలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయడానికి యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కృషి చేయాలని కోరారు. పాలకుర్తి ఎమ్మెల్యే టికెట్ తనకే వస్తుందని, ఎవరికైనా ఏ సమస్య వచ్చిన నా దృష్టికి తీసుకురావాలని సూచించారు. నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినని ప్రజల కష్టం ఏమిటో నాకు తెలుసని నా జీవితం పూర్తిగా పాలకుర్తి ప్రజలకు అంకితమని అన్నారు. అధిష్టానం ఎవరికీ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కలిసి పనిచేస్తామని, పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లిని ఓడించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. పాలకుర్తిలో ఓడిన, గెలిచిన నిత్యం పాలకుర్తి ప్రజల వెంటే ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ది అనిల్ గౌడ్, రాకేష్, బైరి సందీప్, మహేష్, సునీల్, అనిల్, సందీప్ రెడ్డి, సిద్దు, వంశీ, నాగార్జున, డి సందీప్, చంటి, గోపి, కృష్ణ, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code