*
గుమ్మడిదల తెలంగాణ సాక్షి న్యూస్:-
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం పోలీస్ స్టే ఐజి శివ శంకర్ రెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ పరిధిలోని బొంత పల్లి చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేసి తగు సూచనలు చేశారు. అనవసరంగా రోడ్లపైకి రాకుండా ఇంటి వద్ద క్షేమంగా ఉండాలని ఆయన సూచించారు. ఎలాంటి అనుమతులు పాసులు లేకుండా రోడ్ల మీదికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. లాక్ డౌన్ అమలుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. ఆయన వెంట స్థానిక ఎస్ఐ విజయకృష్ణ పోలీస్ సిబ్బంది ఉన్నారు.

0 Comments