ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ను భారీ మెజారిటీ తో రెండోసారి గేలిపిస్తాం:కాశపాగ ఇమ్మయ్య
వట్పల్లి ,వాస్తవ తెలంగాణ న్యూస్:
చంటి క్రాంతి కిరణ్ పై నమ్మకంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రెండోసారి అవకాశం కల్పించారు ముఖ్యమంత్రి కీ ధన్యవాదాలు తెలియచేస్తూ చంటి క్రాంతి కిరణ్ భారీ మెజారిటీ తో గెలిపిస్తామని జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కాశపాగ ఇమ్మయ్య అన్నారు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఎవ్వరికీ రాని మెజారిటీని కైవసం చేసుకొని ప్రజల యొక్క మన్ననలు పొందుతూ ముందుకు పోతున్న క్రాంతి కిరణ్ మళ్లీ 2023 ఎన్నికల్లో ఊహించని భారీ మెజారిటీతో విజయం సాధించడంలో ప్రజలు పాత్ర పోషిస్తారని ఆయన అన్నారు ఇప్పటివరకు నియోజకవర్గంలో ఏ నాయకులు కూడా స్థానిక ప్రజలతో కలిసి నడిచిన రోజులు లేవు కానీ ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ప్రతి కార్యకర్తతో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మాట్లాడి ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు వెళుతున్నారు ఈ విషయాన్ని నియోజకవర్గంలోని ప్రతి మనిషికి తెలుసన్నారు గతంలో ఉన్న నాయకులు కలసి మాట్లాడాలంటే వేల రూపాయలతో కూడుకున్న వ్యవహారం గా ఉండేది కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే ప్రతి నిమిషం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు దాన్ని జీర్ణించుకోలేని కొందరు అసత్య ప్రచారాలతో పాబ్బం గడుపుతున్నారని ఆయన అన్నారు.

0 Comments