Wanted Reporters

Wanted Reporters

విద్యార్థుల రాజకీయ పార్టీలో భారీగా చేరికలు

 విద్యార్థుల రాజకీయ పార్టీలో భారీగా చేరికలు


నేను సైతం అంటూ మార్పు కోసం కదం తొక్కిన యువత


-విద్యార్థుల రాజకీయ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మన్మోహన్ తమ్మెర



 వాస్తవ తెలంగాణ, సెప్టెంబర్ 10, రామగుండం ప్రతినిధి:  విద్యార్థుల రాజకీయ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మన్మోహన్ తమ్మెర ఆధ్వర్యంలో పార్టీకి మద్దతుగా ఆదివారం స్థానిక రామగుండం లో  గలపార్టీ కార్యాలయంలో వివిధ  డివిజన్లో పరిధిలో ఉన్నటువంటి సుమారు 150 మంది యువత  మార్పు కోసం నవ సమాజం నిర్మాణ  కోసం మేము సైతం అంటూ పార్టీ లోకి చేరడం జరిగింది వారిని పేరుపేరునా అభినందిస్తూ మన్మోహన్ తమ్మెర పార్టీ కండువా కప్పి పార్టీలోకి సగర్వంగా ఆహ్వానం పలికారు ఈ కార్యక్రమంలో భాగంగా మార్కెట్ రవి మరియు  నాజీర్ గౌస్, ఈ చేరికల్లో కీలకపాత్ర పోషించి పార్టీని ముందుకు తీసుకెళ్తామని వారి సహాయ సహకారాలు ఎప్పుడు పార్టీకి అండగా ఉంటాయని మన్మోహన్ తమ్మెర తో మాట్లాడడం జరిగింది. ఇంకా ముందు ముందు వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పార్టీలో చేరికల కోసం వేచి ఉన్నారని రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా భావించి పార్టీకి అహర్నిశలు తోడుగా కార్యకర్తలకు అండగా ఉంటానని ఉన్నత విద్య నాణ్యమైన వైద్యం కోసం తన చేస్తున్నటువంటి కార్యక్రమాలను మన్మోహన్ తమ్మెర సభ ముఖంగా మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో రామగుండం సీనియర్ సిటిజన్ అధ్యక్షుడు పల్లె సూరన్న మరియు డివిజన్ అధ్యక్షులు గుండా క్రాంతి, బుట్టి శ్రీనివాస్ మార్కెట్ రవి, నాజీర్ గౌస్,ఆర్ముల కుమార్,  రాయమల్లు, కూడెల్లి మల్లేష్ బడారి సతీష్, కళ్ళపెళ్లి ఓంకార్ మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code