Wanted Reporters

Wanted Reporters

నేతన్నలకు కొండంతా ధీమా సిఎం కేసీఆర్‌, కేటీఆర్ లు

 నేతన్నలకు కొండంతా ధీమా సిఎం కేసీఆర్‌, కేటీఆర్ లు


నియోజకవర్గం లో పద్మశాలిల సంక్షేమానికి కృషి


-రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ 



వాస్తవ తెలంగాణ, సెప్టెంబర్ 10, రామగుండం ప్రతినిధి: దేశంలో నేతన్నలను కడపులోపెట్థఫుకుని కపాడుతుంది తెలంగాణ ప్రభుత్వం ... నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపింది  సిఎం కేసీఆర్‌,  మంత్రి కేటీఆర్ ని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. అదివారం గోదావరిఖని పట్టణం రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్లో పద్మశాలి ఆత్మీయ సమ్మేళనం లో శాసనమండలి సభ్యులు ఎల్.రమణతో కలసి ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పద్మశాలిల సంక్షేమానికి పేద్దపీట వేస్తున్నారన్నారు. దేశ స్వాతంత్ర్య అనంతరం  దేశంలో ఏ రాష్ట్రం లో నేతన్నలను పట్టించుకోలేదన్నారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేత కార్మికులు ఆసరా పధకం నేతభీమా అందిస్తుంది అన్నారు. నేత కార్మికులకు పని కల్పించాలనీ అర్దికంగా  అదుకోవాలనీ బతుకమ్మ చీరాల తయారికి నేత కార్మికులకు అందించడం జరిగిందన్నారు. రామగుండం నియోజకవర్గం లో తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో  చరిత్రలో నిలిచిపోయెాలా  ఈ ప్రాంతంలో అలుపెరగని పోరాటం సాగించామన్నారు. పద్మశాలి కులబంధవులు తమతో పాటుగా తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్నరన్నారు. రామగుండం నియోజకవర్గం పద్మశాలి కులబంధవుల ఆత్మ గౌరవ భవనాల నిర్మాణాల కోసం  మార్కండేయ కాలనీలో 20 లక్షలు 8 వ కాలనీలో 10 లక్షలు ఎన్టీపీసీలో స్దలం ఎలకలపల్లిలో నిధులు కేటాయుంచామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లో మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయాలనీ పలుమార్లు ముఖ్యమంత్రి విన్నవించడం జరిగిందన్నారు.కేసీఆర్‌ ని  మెప్పించి ఓప్పించి సింగరేణి ద్వారా వైద్యం కళాశాల ప్రారంభింజేశామన్నారు.  ప్రజల కోసం సబ్ రిజిస్టర్ కార్యాలయం సీనియర్ సివిల్ జడ్జి కోర్టు తీసుకువచ్చమన్నారు.  సిఎం . 

 తెలంగాణ రాష్ట్రం లో సకల వర్గాల సంక్షేమ కోసం అహర్నిషలు కృషి చేస్తున్న కేసీఆర్‌ బుణం తీర్చుకోవాలనీ సిఎం కేసీఆర్‌ ని హ్యట్రిక్ సిఎంగా గెలిపించాలన్నారు. పద్మశాలిలు అంతా రాబోవు ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం లో రామగుండం నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక హరి, అడ్డాల రామస్వామి, బోడ్డు రవీందర్, నూతి తిరుపతి,  కార్పోరేటర్ బాల రాజ్ కుమార్, పద్మశాలి సంఘ నాయకులు గుండేటి శ్రీనివాస్, మండల సత్యనారాయణ, చిప్ప రాజేశం, ఆడెపు శంకర్, అందే సదానందం, వంగ వీరస్వామి, రాజ్ గోపాల్, వంగర శ్రీనివాస్, సిరిమల్ల మధు, వడ్ధెపల్లి దినేశ్, చిప్ప రజిత, శ్రీనివాస్, విజయ, చంద్రశేఖర్,  నాగమణి, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code