ఘనంగా బోడుప్పల్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడ సంజీవ రెడ్డి జన్మదిన వేడుకలు...
వేడుకలల్లో పాల్గొని శుభాకాంక్షలు తెల్పిన మంత్రి మల్లారెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్.
మేడ్చల్ జిల్లా,(వాస్తవతెలంగాణ మేడిపల్లి/సెప్టెంబర్ : 10) బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవ రెడ్డి పుట్టినరోజు వేడుకలు R-కన్వెన్షన్ హాల్లో బోడుప్పల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు,అభిమానుల నడుమ ఘనంగా జరిగయి ఈ వేడుకలకు కార్మిక & ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్ పాల్గొని మంద సంజీవరెడ్డి చే కేక్ కట్ చేయించి గజమాల తో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.ఈ సందర్బంగా బోడుప్పల్ కార్పొరేషన్ సీనియర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు చెంగిచెర్ల గ్రామ పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ కొత్త రవి గౌడ్ మాట్లాడుతూ ముందుగా మంద సంజీవరెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు అని సంజీవరెడ్డి మంచి వ్యక్తి అని బోడుప్పల్లో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా కార్పొరేషన్ లో మంచి సేవలు అందిస్తున్నారని పార్టీ తలపెట్టే ప్రతి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొంటూ పార్టీలోని ప్రతి కార్యకర్తను తనదైన శైలిలో అక్కున చేర్చుకుని బోడుప్పల్ కార్పొరేషన్ లో బిఆర్ఎస్ పార్టీ ముందుకుతీసుకోని వెళ్తున్నారు అని వారికి ఎల్లవేళలా మంచి జరగాలని కోరుకుంటూ వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ,సహకార బ్యాంక్ డైరెక్టర్ జడిగే రమేష్,కార్పొరేటర్లు, కో - ఆప్షన్ సభ్యులు పలు డివిజన్ ఇన్ ఛార్జ్ లు, ఉద్యమ కారులు, సీనియర్ నాయకులు,అనుబంధ కమిటీ సభ్యులు,డివిజన్ కమిటీ అధ్యక్ష,కార్యదర్శులు, సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments