Wanted Reporters

Wanted Reporters

కోనాయిపల్లి లో మాస్ శ్రమదానం చేసిన : రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ ముదిరాజ్

 కోనాయిపల్లి లో మాస్ శ్రమదానం చేసిన : రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ ముదిరాజ్ 




మనోహరబాద్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి నవీన్ : జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా మనోహరబాద్ మండలం  కోనాయిపల్లి(పి.టి) గ్రామ పంచాయతీ లో గ్రామ సర్పంచ్ బాషబోయిన ప్రభావతి నర్సింలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.. అనంతరం జాతీయ సమైక్యత దినోత్సవ విశిష్టతను గ్రామ కార్యదర్శి ప్రజలకు వివరించారు ఆనంతరం స్వచ్ఛతా హి సేవ 2023 స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా   ఆదివారం రోజు కోనాయిపల్లి(పి.టి) గ్రామ పంచాయతీ లో మాస్ శ్రమదానన్ని రాష్ట్ర నాయకులు బాషాబోయిన చంద్రశేఖర్ ముదిరాజ్ గ్రామస్తులతో కలిసి నిర్వహించారు.. ఇట్టి కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించి  పెద్ద ఎత్తున ప్రజలు యువకులు మహిళలు పాల్గొనే విధంగా చర్యలు చేపట్టారు.గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి వాటర్ ట్యాంక్ వరకు శ్రమదానం చేపట్టారు.ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బాషాబోయిన చంద్రశేఖర్ ముదిరాజ్ , గ్రామ సర్పంచ్ బాషబోయిన ప్రభావతి నర్సిoలు ,పాలకవర్గo  సభ్యులు,గ్రామ కార్యదర్శి నవీన్ ,గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code