పర్కిబండ లో నైజాం విముక్త దినోత్సవం
మనోహరబాద్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి నవీన్ : నిజాం దూరక్రమణ పాలన నుండి విముక్తి పొందిన సందర్బంగా స్వాతంత్ర అమృతోత్సవాల్లో భాగంగా ఆదివారం మండలం లొని పర్కిబండ తదితర గ్రామాలలో జాతీయ జెండాను ఎగురవేశారు.ఈకార్యక్రమంలో గ్రామ ప్రథమ పౌరుడు పూల అర్జున్ నిజాం విముక్త స్వాతంత్ర అమృతోత్సవ కమిటీ అధ్యక్షులు ఏమ నాగరాజు, పర్కిబండ వార్డ్ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణకు 15 ఆగస్ట్ 1947 లో స్వాతంత్ర రాలేదు. తెలంగాణ అంటే అప్పుడు ఉన్న కర్ణాటక లోని నాలుగు జిల్లాలు, మహారాష్ట్ర లోని 5 జిల్లాలు, తెలంగాణ లో 9 జిల్లాలు మొత్తం 18 జిల్లాలు హైదరాబాద్ సంస్థానం అని పిలుస్తుండేవారు. మీర్ ఉస్మాన్ హాలీఖాన్ అనే నిజాం పరిపాలనలో ఉంది ఈ ప్రాంతం మొత్తం భారతదేశం తో సంభంధం లేకుండా పరిపాలన సాగేదని తెలంగాణ లో స్వాతంత్ర వేడుకలు కూడా జరుపుకునే అవకాశం ఉండేది కాదు వేడుకలను జరిపినటైతే వారిని చంపేస్తారని, తల తీసేస్తారని భయంతో స్వాతంత్ర వేడుకలు జరుపుకోలేని పరిస్థితి నైజాం పరిపాలనలో ఉండేదని,ఖాసీం రజ్వీ రజాకారులు ద్వారా తెలంగాణ ప్రజలని చిత్ర హింసలు పెట్టేవారు,నైజాం ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా తెలంగాణకు స్వాతంత్ర కావాలి అని పోరాడే వారిని వేయి ఊరుల మరి చెట్టు అని మనం విని ఉంటాం ఆ చెట్టుకు వేయి మందిని మర్రిచేట్టుకు ఉరి వేసి ఉచ్చకోత కోసిన అటువంటి పరిస్థితి ఉండేది నైజాం ప్రభుత్వానికి వెతిరేకంగా పోరాడుతున్నా వారి దారునాలకి అంతులేకుండా పోయింది. తెలంగాణలో జరుగుతున్న హింసలను ప్రజలకు జరుతున్న వివక్షత గురించి తెలుసుకున్న అప్పటి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అయినా సర్ధార్ వల్లభాయ్ పటేల్ గారు తెలంగాణలో పోలో ఆపరేషన్ ద్వారా తెలంగాణ నాలుగు వైపులా నుండి కేంద్ర బలగాలను మొహరించి కాల్పులు జరుపుతూ రజాకారులను పట్టుకోవడం జరిగింది నైజాం ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసులను భందించడం జరిగింది. విషయాన్నీ తెలుసుకున్న నైజాం ప్రాణ భయంతో సర్ధార్ వల్లభాయ్ పటేల్ గారి వద్దకు కాళ్ళ బ్యారానికి వచ్చాడు. ప్రాణ భిక్ష పేటండి అని అప్పటివరకు ఎప్పుడు కూడా ఎవరికీ కూడా తల వంచని నైజాం రాజు సర్ధార్ వల్లభాయ్ పటేల్ కు లొంగిపోవడం తో వారి కృషి ఫలితమే నేటి తెలంగాణ స్వతంత్రం ఫలితమే నేటి తెలంగాణ విమోచన దినోత్సవంకు గుర్తింపు అని అన్నారు.

0 Comments