Wanted Reporters

Wanted Reporters

అంగన్వాడీలు కనీస వేతనం అడుగుతే అక్రమ అరెస్టులు చేస్తారా.- ఆదివాసి సీనియర్ రాష్ట్ర నేత పూనెం.సాయి దొర

 అంగన్వాడీలు కనీస వేతనం అడుగుతే అక్రమ అరెస్టులు చేస్తారా.- ఆదివాసి సీనియర్ రాష్ట్ర నేత పూనెం.సాయి దొర         

వాస్తవ తెలంగాణ, (నుగూరు)వెంకటాపురం, ప్రతినిధి సెప్టెంబర్ 28:

ములుగు జిల్లా వెంకటాపురం మండలం గురువారం ఆర్ ఎం బి గెస్ట్ హౌస్ సవరణంలో ఆదివాసి యూత్ అత్యవసర సమావేశం మడకం.రవి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో ఆదివాసి సీనియర్ రాష్ట్ర నేత పూనెం. సాయి దొర మాట్లాడుతూ.. అంగన్వాడి టీచర్స్ గత 18 రోజుల నుండి వారి డిమాండ్స్ కోసం ఉద్యమం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అన్నారు.టీచర్స్ కు కనీసవేతనం ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించాలని, ములుగు జిల్లా కు మంత్రి తన్నీరు హరీష్ రావుకు అంగనవాడి టీచర్స్ వినతి పత్రాలు విచ్చే అవకాశం కూడా దక్కలేదని ఆయన ఆరోపించారు.అంగనవాడి టీచర్స్ ఏం తప్పు చేశారని ఆయన ప్రశ్నించారు. అంగన్వాడి టీచర్స్ తో ఈ తెలంగాణ ప్రభుత్వం ఎట్టి సాకిరి చేయించడానికి పూనుకున్నదా అని ఆయన ప్రశ్నించారు.అంగనవాడి టీచర్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సవితి తల్లి ప్రేమ చూపుతున్నదని ఆయన ఆరోపించారు.అంగన్వాడీలు చేస్తున్న సమ్మె కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కండ్లకు కనిపించడం లేదా అని ఆయన మండిపడ్డారు.ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దించడమే లక్ష్యంగా ఉద్యమించే అవసరం ఆసన్నమైందని అంగన్వాడి ఉద్యోగుల తో సమావేశం ఏర్పాటు చేసి అంగన్వాడీల ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సూర్యం,పార్ధు,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code