నేడు పుల్కల్ మండలానికి ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ రాక
పుల్కల్ వాస్తవ తెలంగాణ న్యూస్...
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మరియు భూమి పూజ కార్యక్రమానికి నేడు ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ హాజరవుతున్నారని టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల విజయకుమార్ తెలిపారు. మండల కేంద్రమైన పుల్కల్లో అన్ని గ్రామాల సర్పంచులు ఎంపిటిసిలు టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుల తో కలిసి విలేకరులతో మాట్లాడారు. మండలంలోని పలు గ్రామాల్లో సిసి రోడ్లు.. డ్రైనేజ్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన మరియు భూమి పూజ చేస్తారని తెలిపారు. ఇట్టి కార్యక్రమాన్ని అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు గ్రామ అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన అన్నారు .ఈ కార్యక్రమంలో రైతు సమితి అధ్యక్షుడు నరసింహారెడ్డి.టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు పల్లె సంజీవయ్య .ఆత్మ కమిటీ చైర్మన్ యాదగిరి రెడ్డి. బస్వాపూర్ సర్పంచ్ కృష్ణయ్య. రాయి పాడు గ్రామ అధ్యక్షుడు రాజు. శ్రీనివాస్ చారి. పాల్గొన్నారు

0 Comments