*అల్లాదుర్గం మండల సాక్షి రిపోర్టర్ పై దాడినీ ఖండించిన టేక్మాల్ మండల జర్నలిస్టులు*
*అల్లాదుర్గం ఎంపీపీ పై కేసు నమోదు చేయాలి*
*లేనిపక్షంలో ఎంతటి పోరాటానికైనా వెనకాడ బోమని టేక్మాల్ మండల జర్నలిస్టులు హెచ్చరించారు*
*వాస్తవ తెలంగాణ న్యూస్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి పవన్*
మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం అల్లాదుర్గం మండల సీనియర్ సాక్షి జర్నలిస్టు వీరన్న పై మండల అధికార పార్టీ ఎంపీపీ దాడి చేయడం ఎంతవరకు న్యాయమని టేక్మాల్ మండల జర్నలిస్టులు మండిపడ్డారు అల్లాదుర్గం మండలంలో ఎమ్మెల్యే పై అసంతృప్తి అనే ఓ కథనాన్ని ప్రచురించారు ఆ వార్త ఎలా రాస్తావు అంటూ సాక్షి విలేఖరి వీరన్న పై పోలీస్ స్టేషన్ సమీపంలోనే దాడి చేసినటువంటి అధికార పార్టీ ఎంపీపీ గారిని వెంటనే అరెస్టు చేయాలని టేక్మాల్ మండల జర్నలిస్టులు డిమాండ్ చేశారు
ఈమధ్యకాలంలో అధికార పార్టీ వ్యవస్థలపై కథనాలు ప్రచురిస్తే అధికార పార్టీ నాయకులు తమ అధికార పార్టీ అండదండలతో అక్కసును విలేకరులపై వెళ్లగక్కుతున్నారని అన్నారు అనవసరమైన కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు దాడిని నిరసిస్తూ టేక్మాల్ మండల యూనియన్ జర్నలిస్టులు దాడిని ఖండిస్తూ టేక్మాల్ మండల తహసిల్దార్ గారికి వినతి పత్రం అందజేశారు జర్నలిస్టులపై ఏ నాయకులైన అధికార పార్టీ బలంతో దాడులు చేయిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు అల్లాదుర్గం ఎంపీపీ పైన కేసు నమోదు చేసేంతవరకు మా పోరాటం ఆగదని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో టెక్మా ల్ మండల సీనియర్ జర్నలిస్టులు నియోజకవర్గం జిల్లా ఇన్చార్జిలు పాల్గొన్నారు

0 Comments