అగస్త్య అంతర్జాతీయ ఫౌండేషన్(కాగ్నిజెంట్ ఫౌండేషన్) విజ్ఞాన శాస్త్ర ప్రదర్శన ప్రిన్సిపల్: అర్షియా తరుణం
తూప్రాన్ వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి నవీన్ : విద్యార్థుల కొరకు అగస్త్య అంతర్జాతీయ ఫౌండేషన్ (కాగ్నిజెంట్ ఫౌండేషన్) వారు మహాత్మా జ్యోతి బాపులే ఉన్నత పాఠశాల తూప్రాన్(నర్సాపూర్) లో విజ్ఞానశాస్త్ర ప్రదర్శన ను మహాత్మ జ్యోతిబాపూలే ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ హర్షియా తరుణం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అర్షియా తరణుం మరియు ఉపాధ్యాయినులు చేత ప్రారంభించడం జరిగింది. ఈ కార్య్రక్రమాన్ని ఉద్దేశించి అర్షియా తరణుం మాట్లాడుతూ విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనలు విద్యార్థులకు ఉపయోగకరంగా ఉన్నాయి అని మరియు విజ్ఞానశాస్త్రం పై విద్యార్థులకు అవగాహన ఎంతో అవసరమని ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థులలో ఉన్న ప్రతిభను వెలికి తీసే అవకాశం ఉంటుందని, వారి శక్తిని మరింత పెంచుకోవడానికి దోహదపడుతుందని మరియు చాలా సులభంగా అర్థం చేసుకునేలా ఉన్నాయి అన్నారు, ఈ కార్యక్రమం నిర్వహించినందుకు అగస్త్య ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు మాట్లాడుతూ ఈ విజ్ఞానశాస్త్ర నమూనాలు మాకు సృజనాత్మతను పెంపొందించే విధంగా ఉన్నాయి అన్నారు. ఈ విజ్ఞానశాస్త్ర ప్రదర్శనలు భౌతిక(కాంతి, విద్యుత్, ఉష్ణం మరియు యాంత్రిక), జీవ(మానవ శరీర అవయవాలు, మెదడు, అస్థిపంజరం, కీళ్లు, దృష్టి స్థిరత), రసాయన(ప్లాస్మా స్థితి ఏర్పడటం, రసాయన చర్యలు) మరియు ఖగోళ(రాత్రి, పగలు, కాలాలు ఏర్పడటం మరియు చంద్రకళ లు) శాస్త్రం లకు చెందిన నమూనాలు ప్రదర్శించడం జరిగింది. ఈ నమూనాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల బృందం, అగస్త్య ప్రతినిధులు, శ్రీకాంత్, సరిత, దిగంబర్, విద్యార్థులు పాల్గొన్నారు


0 Comments