*సీఎం కేసీఆర్ ను కలిసిన నాయకులు*
మేడ్చల్ వాస్తవ తెలంగాణ ప్రతినిధి ఆనంద్.
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పాల్గొన్న సీఎం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందని పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తెలిపారు. శనివారం సీఎం కేసీఆర్ చేతులు మీదుగా పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో భాగంగా కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తో పాటు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మాజీ చైర్మన్ సత్యనారాయణ, మేడ్చల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

0 Comments