ఊట్ల గ్రామంలో మసీదును ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్
జిన్నారం,వాస్తవ తెలంగాణ న్యూస్:
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఊట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన మసీదును ఆదివారం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు, పార్టీ మండల అధ్యక్షులు రాజేష్, తదితరులు పాల్గొన్నారు.


0 Comments