Wanted Reporters

Wanted Reporters

రాళ్ళకత్వలో యువకులకు స్పోర్ట్స్ డ్రెస్సుల పంపిణీ


 

రాళ్ళకత్వలో యువకులకు స్పోర్ట్స్ డ్రెస్సుల పంపిణీ

జిన్నారం,వాస్తవ తెలంగాణ న్యూస్:

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామంలోని యువకులకు పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆదివారం స్పోర్ట్స్ డ్రెస్సులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. దీంతో పాటు క్రీడారంగం పట్ల యువత ఆసక్తి కనబరిచేలా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసి రాష్ట్ర, జాతీయస్థాయిలో పోటీపడేలా శిక్షణ అందించేందుకు సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, సీనియర్ వెంకటేష్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు, పార్టీ మండల అధ్యక్షులు రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments

Ad Code