మహిళా దినోత్సవ సంబరాలు వంగ అక్షిత రెడ్డి అధ్వర్యంలో
సిద్దిపేట జిల్లా, ములుగు మండలం - వాస్తవ తెలంగాణ న్యూస్: కేటీఆర్, హరీష్ రావు పిలుపుమేరకు ఈనెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించే సంబరాల్లో భాగంగా ఆదివారం రోజున కొట్యల్ గ్రామంలో ములుగు మండలం మహిళా అధ్యక్షురాలు వంగ అక్షిత రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు అందరు కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే మహిళలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. పుట్టిన ఆడ బిడ్డ నుండి పండు ముసలి వరకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేసినట్లు స్వయం చేశారు. రాష్ట్రంలో కెసిఆర్ కిట్, కల్యాణ లక్ష్మి , షాదీ ముబారక్, ఒంటరి మహిళలకు పెన్షన్ లు వస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళ లకు అండగా ఉంటారని అన్నారు.
0 Comments