నాలుగవ అంతస్తు నుండి కాలుజారి చిన్నారి మృతి
సిద్దిపేట జిల్లా, ములుగు మండలం - వాస్తవ తెలంగాణ న్యూస్: సిద్దిపేట జిల్లా ఏనగుర్తి గ్రామానికి చెందిన ఇస్తారి భానుతేజ ఇతని కాలికి రాడు తీయించడానికి ములుగు మండలం లక్ష్మక్కపల్లి ఆర్విఎం ఆస్పత్రిలో శనివారం సాయంత్రం అడ్మిట్ అయ్యారు. ఇతని ఒక భార్య ఇస్తారి మమత తమ కూతురు ఇస్తారి శ్రీక్షిత 3 సంవత్సరాలు, శ్రిక్షిత నీ తీసుకొని నాలుగవ అంతస్తు పైకి బట్టలు ఆరేయడానికి వెళ్ళింది. అక్కడ ఉన్న మెట్ల దగ్గర శిక్షిత ఆడుకుంటూ మెట్ల పైన నుండి గ్రౌండ్ ఫ్లోర్ పైన పడింది. తలకి తీవ్ర గాయం కావడంతో అక్కడే హాస్పటల్లో చికిత్స చేస్తుండగా ఆదివారం మధ్యాహ్నం 1: 40 గంటలకు శ్రీక్షిత మరణించింది. ఈ విషయంలో చర్యలు తీసుకుంటామని ములుగు ఎస్సై రంగ కృష్ణ గౌడ్ ఉన్నారు.
0 Comments