ఎమ్మెల్యే వివేకానంద కు కృతజ్ఞతలు తెలిపిన బాలయ్య నగర్ సంక్షేమ సంఘం సభ్యులు..
(కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద కాలనీ వాసుల సన్మానం)కుత్బుల్లాపూర్,వాస్తవ తెలంగాణ న్యూస్:మేడ్చల్ జిల్లా గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని బాలయ్య నగర్ కు చెందిన సంక్షేమ సంఘం సభ్యులు శనివారం రోజు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి. ఈ సందర్భంగా తమ బస్తీలో నూతన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటుకు కృషి చేస్తున్న నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, నాగేష్, పార్వతి, గొకుల్, ప్రసాద్, సిహెచ్ సాయిలు, శ్యామ్, హన్మంత్, నాగమణి, జయ రమేష్, వెంకటేష్, వెంకట్, రేణుక, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.

0 Comments