Wanted Reporters

Wanted Reporters

డిగ్రీ పరీక్షలను పోస్ట్ పోన్ చేయండి..!పాఠాలు చెప్పకుండానే పరీక్షలు రాయమంటే ఎలా..?

డిగ్రీ పరీక్షలను పోస్ట్ పోన్ చేయండి..!పాఠాలు చెప్పకుండానే పరీక్షలు రాయమంటే ఎలా..?


సిద్దిపేట,వాస్తవ తెలంగాణ న్యూస్ ప్రతినిధి:విద్యాసంస్థలు ప్రారంభించిన వెంటనే సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ అటానమస్ కళాశాలలో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించడం ఏంటని పీ.డీ.ఎస్.యు సిద్దిపేట జిల్లా సహాయ కార్యదర్శి విద్యనాథ్ అన్నారు.

పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ ప్రిన్సిపాల్ ప్రసాద్ గారి కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా విద్యనాథ్ మాట్లాడుతూ

చాలా కోర్సుల విద్యార్థులకు ఇంకా పూర్తి స్థాయిలో సిలబస్ కూడా చెప్పలేదని ఆన్లైన్ లో తూతుమంత్రంగా క్లాసులు చెప్పి తీరా ఇప్పుడు ఒకటవ తేదీన కాలేజీ తెరిచి కనీసం చదువుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా కేవలం అరు రోజులలోనే పరీక్షల షెడ్యూల్ విడుదల చేసి విద్యార్థులను అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

తక్షణమే ఈనెల 8వ తేదీ నుంచి జరగబోయే 3,5వ సెమిస్టర్ పరీక్షలను వారం రోజుల పాటు పోస్ట్ పోన్  చేయాలనీ కోరారు.

లేనిపక్షంలోఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పీ.డీ.ఎస్.యు పట్టణ ఉపాధ్యక్షుడు ప్రణయ్,కాలేజీ కమిటీ కార్యదర్శి తేజస్విని,కన్వీనర్ భార్గవి,నాయకులు వెంకటేష్,కృపాకర్,వైష్ణవి,రాజు,సోహెల్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments

Ad Code