ముదిరాజ్ లు రాజకీయంగా రాణించాలి
శివ్వంపేట,వాస్తవ తెలంగాణ న్యూస్ : ముదిరాజ్ లు రాజకీయంగా రాణిస్తేనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యం అవుతుందని ముదిరాజ్ మహాసభ నర్సాపూర్ నియోజకవర్గం అధ్యక్షులు దిగంబర్ ముదిరాజ్, మండల అధ్యక్షుడు లక్ష్మి నర్సయ్య ముదిరాజ్ అన్నారు. గురువారం శివ్వంపేట ఉమామహేశ్వర దేవాలయం వద్ద మండల ముదిరాజ్ సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అన్ని గ్రామలలో ముదిరాజ్ సంఘo కమిటీ, మచ్చపరిశ్రమిక సహకార కమిటీ మరియు ముదిరాజ్ మహిళా కమిటీ, ముదిరాజ్ యువ జన కమిటీ, ముదిరాజ్ విద్యార్థి కమిటీలు గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయాలనీ సూచించారు. ఇవన్నీ కూడ పది రోజులలో పూర్తి చేసి తాలూకా ముదిరాజ్ సంఘo అధ్యక్షులకు అందచేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో దేవానబోయిన కృష్ణ, దుబ్బ శేఖర్, రాజిపేట వెంకటేష్, జోడు బాలయ్య, వినోద్, ముద్దగళ్ల రాజు, శ్రీనివాస్, లక్ష్మినారాయణ, అర్జున్, ఆంజనేయులు, భిక్షపతి, మహిపాల్, కండెగారి రత్నం, పాల్గొన్నారు.
0 Comments