Wanted Reporters

Wanted Reporters

జూన్‌లో పూర్తి కానున్న ఆచార్య షూటింగ్.. రిలీజ్ ఎప్పుడో?

 జూన్‌లో పూర్తి కానున్న ఆచార్య షూటింగ్.. రిలీజ్ ఎప్పుడో?

జూన్‌లో పూర్తి కానున్న ఆచార్య షూటింగ్.. రిలీజ్ ఎప్పుడో?

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం ఆచార్య‌. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు అనేక అవాంత‌రాలు ఏర్ప‌డుతున్నాయి. ముఖ్యంగా లాక్‌డౌన్ వ‌ల‌న ఈ సినిమా వాయిదా ప‌డుతూ వ‌స్తుంది. మూడేళ్లుగా ఈ చిత్రంతోనే బిజీగా ఉన్న కొర‌టాల శివ ఈ సినిమాని 2020లోనే పూర్తి చేయాలని అనుకున్నాడు. కాని లాక్‌డౌన్ వ‌ల‌న అది కుద‌ర‌లేదు. లాక్‌డౌన్ త‌ర్వాత షూటింగ్ ప్రారంభించ‌గా, కొద్ది రోజుల‌కే క‌రోనా సెకండ్ వేవ్ మొద‌లు కావ‌డంతో మ‌ళ్లీ వాయాదా ప‌డింది.

చిత్రానికి సంబంధించి ఇంకా 15 రోజుల షూటింగ్ మిగిలి ఉంద‌ని, ఈ పార్ట్‌ని జూన్ లోనే పూర్తి చేయాలని చూస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. రామ్ చరణ్ కూడా ఈ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. ఆయనపై కూడా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉంది. జూన్ వ‌ర‌కు చిత్రం పూర్తైన రిలీజ్ ఆగ‌స్ట్‌కు వెళ్లేలా క‌నిపిస్తుంది. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డే ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు.

Post a Comment

0 Comments

Ad Code