*నేడు మండల కేంద్రానికి ఎమ్మెల్యే రాక*
గుమ్మడిదల, వస్తావా తెలంగాణ న్యూస్:-
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలానికి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం రానున్నట్లు మండల పార్టీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక చంద్ర రెడ్డి గార్డెన్స్ లో కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు, కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొననున్నట్లు తెలిపారు. మండలంలోని ప్రజాప్రతినిధులు అధికారులు పార్టీ నాయకులు కార్యకర్తలు సకాలంలో హాజరు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

0 Comments