జవహర్ నగర్ వ్యవస్థాపకులు కారింగులకు ఘన నివాళి
జవహర్ నగర్, వాస్తవతెలంగాణ న్యూస్: జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జవహర్ నగర్ వ్యవస్థాపకులు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి మాజీ సర్పంచ్ కారింగుల నర్సింగ్ రావు గౌడ్ 23వ వర్ధంతి సందర్భంగా బాలాజీ నగర్ లోని ఆయన విగ్రహానికి జవహర్ నగర్ మున్సిపల్ కార్పోరేషన్ అద్యక్షులు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బండకింది ప్రసాద్ గౌడ్ ,వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్తకొండ వేణు, ఎన్.కిరణ్ కుమార్ ,ఉపాధ్యక్షులు మాట్లా శ్రీనివాస్, కె.కె.చారి, యువజన నాయకులు మాట్లా వినయ్ కుమార్ ,అశోక్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
0 Comments