*ప్రకటించిన తేదీనే లాభాల వాటా ఇవ్వాలి*
రామగుండం,వాస్తవ తెలంగాణ న్యూస్:,ఎన్నికల కోడ్ కు ముందు ప్రకటించిన దానికి అభ్యంతరం ఎలా ?సింగరేణి యాజమాన్యంది అత్యుత్సాహం.ఎవరి ప్రయోజనాల కోసం ఈ జిమ్మిక్కులు,గతంలో ప్రకటించిన విధంగానే ఈనెల వ తేదీన సింగరేణి యాజమాన్యం లాభాల వాటాను చెల్లించాలని *తెలంగాణ గోదావరిలోయ బొగ్గుగని కార్మిక సంఘం(ఐ ఫటుయ్ ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ నరేష్ లు* డిమాండ్ చేశారు.
సార్వత్రిక ఎన్నికల కోడ్ ప్రకటించక ముందే ప్రకటించిన లాభాల వాటాను ఎన్నికల తర్వాత ఇస్తామని ప్రకటించడం దుర్మార్గమని వారు మండిపడ్డారు.పదహారవ తేదీన లాభాల వాటా వస్తున్నాయని ఎంతో మంది కార్మికులు గంపెడంత ఆశలతో ఎదురు చూస్తున్నారన్నారు. లాభాల వాట ఇవ్వకూడదని ఎన్నికల కమిషన్ పంపిన లేఖను బయట పెట్టాలన్నారు. సింగరేణి యాజమాన్యం అత్యుత్సాహం ప్రదర్శిస్తుందని మాకనిపిస్తుందన్నారు.
ఎవరి ప్రయోజనాల కోసం ఎవరిని ఇబ్బందులకు గురి చేస్తున్నారో యావత్ కార్మిక వర్గానికి అవగతం అవుతున్నదని వారు స్పష్టం చేశారు.
తక్షణమే అనుకున్న తేదీ నాడు లాభాల వాటా ఇవ్వని ఎడల కోల్ బెల్ట్ వ్యాప్తంగా చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలకు పూర్తి బాధ్యత సింగరేణి యాజమాన్యమే వహించాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు.

0 Comments