*భవన నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలి - ఎంపీపీ, జడ్పిటిసి*
గుమ్మడిదల, వాస్తవ తెలంగాణ న్యూస్:-
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం వీరన్న గూడెం గ్రామ పంచాయతీ భవనం నిర్మాణ పనులను ఎంపీపీ సద్ది ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి, జడ్పిటిసి కుమార్ గౌడ్ లు సోమవారం పరిశీలించారు. భవన నిర్మాణ పనులను నాణ్యత గా నిర్మించాలని సందర్భంగా కాంట్రాక్టర్ కు సూచించారు. నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేసేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మమత వేణు, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, మార్కెట్ కమిటీ సభ్యుడు గౌరీశంకర్ గౌడ్, వార్డ్ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

0 Comments