కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి .
నర్సాపూర్, వాస్తవ తెలంగాణ// ఆడపిల్లలకు అండగా ఉండేందుకు సీఎం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం,షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. గురువారం నర్సాపూర్ లోని మండల తాసిల్దార్ కార్యాలయం ఆవరణలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటగా కళ్యాణ లక్ష్మి పథకానికి 51 వేల రూపాయలు ఇచ్చేవారని అదికూడా దళితులకు మాత్రమే ఇచ్చారన్నారు. ప్రస్తుతం కల్యాణ లక్ష్మి సబ్బండ వర్గానికి వర్తింపజేస్తూ లక్ష నూట పదహారు రూపాయలు పెంచారని అన్నారు.ఈ మేరకు సబ్బండ వర్గానికి సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో కెసిఆర్ ను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి తో పాటు ఆర్ డి ఓ వెంకట ఉపేందర్ రెడ్డి,డి ఎం ఆర్ ఓ నవీన్ కుమార్, ఎం పి డి ఓ వైద్య శ్రీనివాస్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
0 Comments