వీర శైవ లింగాయత్ లింగ బలిజ సంఘానికి కోకాపేటలో ఒక ఎకరం స్థలం మరియు భవన నిర్మాణానికి 10 కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి పాలిభిషేకం..
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 3 (వాస్తవ తెలంగాణ)వీర శైవ లింగాయత్ లింగ బలిజ సంఘానికి కోకాపేటలో ఒక ఎకరం స్థలం మరియు భవన నిర్మాణానికి 10 కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కి కృతజ్ఞతగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వీర శైవ లింగాయత్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ గురువారం ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ సమక్షంలో వారి నివాసం వద్ద పాలాభిషేకం చేసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని కులాల అభ్యున్నతికి హైదరాబాద్ నగరంలో భవన నిర్మాణానికి స్థలం కేటాహించడం జరిగింది అని, అదేవిదంగా వీర శైవ లింగాయత్ లింగ బలిజ సంఘానికి భవన నిర్మాణానికి 10 కోట్లు మరియు స్థలం కేటాహించడం పట్ల సంతోషం వ్యక్తపరుస్తూ కెసిఆర్ కి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సుభాష్ నగర్ డివిజన్ అధ్యక్షుడు పోలె శ్రీకాంత్, ప్రకాష్ రుద్రా కుమార్,అమరనాథ్, వీరేశం, ఇమ్మడి వేణు,బస్వరాజు, వీరన్న గౌడ, నాగరాజు గౌడ తదితరులు పాల్గొన్నారు.
0 Comments