ఎమ్మెల్యే చొరవతో మరణించిన కార్మికుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందజేత.
కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 3 (వాస్తవ తెలంగాణ)కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని శివాలయ నగర్ కు చెందిన పి.దుర్గయ్య (45) జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని బ్యాక్ లైట్ హైలెం లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నాడు. కాగా ఎప్పటిలాగే విధులు నిర్వర్తిస్తుండగా గత నెల 28వ తేదీన ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనలో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యాన్నిచ్చారు. సదరు కంపెనీ యాజమాన్యంతో చర్చించి మృతి చెందిన దుర్గయ్య కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం అందే విధంగా కృషి చేశారు. ఈ మేరకు చెక్కును ఈరోజు ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ తో కలిసి బాధితకుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కార్మికులకు ఏ కష్టం వచ్చినా ముందుంటానని అన్నారు. అనంతరం బాధితకుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కంపెనీ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.
0 Comments