దుకాణ సముదాయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి.
నర్సాపూర్,వాస్తవ తెలంగాణ// మార్కేట్ కమిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు.నర్సాపూర్ మార్కెట్ యార్డు ఆవరణలో దుకాణ సముదాయ భవన నిర్మాణానికి గురువారం శంకుస్థాపన,భూమి పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా 10 షేటర్లు నిర్మించడానికి 81 లక్షలు నిధులు మంజూరు కావడం జరిగిందని తెలిపారు. నిధులు మంజూరుకు కృషి చేసిన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్ యార్డు పక్కనే డబుల్ బెడ్ రూంలు ఉండటంతో ఇక్కడ గ్రామాన్ని తలపించే విదంగా ఉంటుందని అన్నారు.మరిన్ని నిధులను సమకూర్చి అధునాతనమైన పద్దతిలో మార్కెట్ యార్డుని రూపుదిద్దుతామని అన్నారు.కూరగాయల మార్కెట్ ఇక్కడే జరిగే విదంగా చేస్తామని అన్నారు.అనంతరం ధర్మకాంట నిర్మాణానికి భూమిపూజ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్,పి ఏ సి ఎస్ చైర్మన్ రాజు యాదవ్,వైస్ చైర్మన్ అబీబ్ ఖాన్,ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్,వైస్ ఎంపీపీ వెంకట నర్సింగరావు,డైరెక్టర్లు జ్ఞనేశ్వర్,సాగర్,గ్రంధాలయం సంస్థ చైర్మన్ చంద్రగౌడ్,జడ్పీటీసీ బాభ్యనాయక్,అశోక్ గౌడ్,రామచందర్,భిక్షపతి, నాగేష్ తదితరులు పాల్గొన్నారు
0 Comments